Verse 1
ప్రేమా యేసు ప్రేమా - ప్రేమా తండ్రి ప్రేమ
మరణమౌనంతగా - కరుణ చూపించెగా
నరమాత్రుని మేథస్సున కందని ప్రేమ - దివిని వీడి భువికరుదెంచి
కరుణతో బ్రోచిన - అద్భుత ప్రేమ
యేసుప్రేమ - యేసు అద్భుత ప్రేమ (2)
Verse 2
మనుషులంత మానిషులై నిలిచిరి - ముక్త కంఠముతో చంపమని అరచిరి
హేళనతో పిలచిరి - కరములతో చరిచిరి (2)
ఐనా నను నిలుపనై - తానే ఆ సిలువపై (2)
అసువుల నర్పించినా - అమరప్రేమ (2)
క్రీస్తుప్రేమ - క్రీస్తు అమరప్రేమ (2) ||ప్రేమ ||
Verse 3
ముండ్ల మకుటమల్లి శిరస్సుపైన గ్రుచ్చిరి
మూర్ఖచిత్తులై ముఖమున ముసుగేసిరి
పిడిగుద్దులు గుద్దిరి - పరిహాసము లాడిరి ||ఐనా ||
Verse 4
చేదు చిరకను త్రాగమని ఇచ్చిరి
యూదుల రాజని చేవ్రాలు వ్రేలగట్టిరి
దుస్తులన్ని కూర్చిరి - చీట్లు వేసి పంచిరి ||ఐనా ||