Verse 1
పశుశాలలో నీవు - పవళించినావా
పరమాత్ముడవు నీవు - పసిబాలుడవు కావు || పశు ||
Verse 2
స్థలమైన లేదే జన్మకు చిరుప్రాయమందే శాస్త్రులును
సరితూగలేదే బోధకులు - తలవంచెగా సర్వలోకము ||పశు ||
Verse 3
స్థాపించలేదే తరగతులు ప్రతిచోట చూడ నీపలుకే
ధరియించలేదే ఆయుధం - వశమాయెగా జనుల హృదయాలు ||పశు ||
Verse 4
పాపాలు మోసి కలువరిలో ఓడించి నావు మరణమును
మేఘాల మీద వెళ్ళినావు - త్వరలోనే భువికి తరలుచున్నావా ||పశు ||