Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Desama Na Desama Desama Bharatha Desama

దేశమా నా దేశమా దేశమా భారత దేశమా

Desama Na Desama Desama Bharatha Desama

Lyricist: Abhishek Devadas
Intro
దేశమా నా దేశమా.. దేశమా భారత దేశమా..‖ 2x ‖
Verse
దేశమా దేశమా నా దేశమా దేశమా
ఏమి ఈ వేదన నీకేలా ఈ శోధన
నీవు తప్పిన మార్గమే నీకు శాపమై మారెనా
ప్రభు దృష్టిలో నీ పాపం బహు ఘోరమై పోయెనా..
దేశమా నా దేశమా.. దేశమా భారత దేశమా
దేశమా వినుమా నీ పాపము వీడుమా
యేసు రాకను కనుమ దైవ రక్షణ పొందుమా
దేశమా నా ప్రియ దేశమా.. దేశమా భారత దేశమా..
Verse
నీనివే పాపము బహు ఘోరమాయెను
దైవ ఉగ్రత ప్రకటించగా ప్రతి మోకాలు వంగెను..
రాజులే దీనులై ఆ దేవుని మొక్కగా దేవుని రక్షణ ఆ దేశాన్ని చేరెను..
దేశమా ఇది గమనించుమా..
నీ స్థితి మరి ఏం అవునో..
నీ పాపాన్ని విడిచి దైవ రక్షణ పొందుమా.
Chorus
దేశమా నా దేశమా..
దేశమా భారత దేశమా..
దేశమా నా ప్రియ దేశమా..
దేశమా భారత దేశమా..!!
Verse
నీ ధనం నీ బలం ఎల్లప్పుడు నిలుచునా
గర్వించకు దేశమా అది శాశ్వతం కాదుగా..
ఈ కష్టము నష్టము ఈ వ్యాధులు తెగుళ్ళు
అది నీ దోషమే.. నీ పాప ఫలితమే..
దేశమా ఇక చాలించుమా.. కన్నీటితో మోకరించి వేడుమా..
ఆ ప్రభు నిన్ను క్షమియించి ఇచ్చును రక్షణ..
Chorus
దేశమా నా దేశమా..
దేశమా భారత దేశమా..
దేశమా వినుమా నీ పాపము వీడుమా
యేసు రాకను కనుమా దైవ రక్షణ పొందుమా
దేశమా నా ప్రియ దేశమా.. దేశమా భారత దేశమా..
యేసులో స్వస్థత.. శ్రీ యేసులో రక్షణ…
యేసులో విడుదల.. శ్రీ యేసులో విజయము…
యేసే మార్గము.. యేసే సత్యము.. యేసే జీవము.. యేసే సర్వము..

Related Tags

RepentanceSalvation