Chorus
దేశసేవఁజేసి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో మోసమార్గములను వీడి
యేసుని నిజదాసు లగుఁడి దోసములను వీడి దేవ దాసులై వర్ధిల్లుఁ
డిలలో‖ దేశ ‖
Verse
దేశ బంధువు యేసువే మన దేశ రక్షకుఁ డాయనే దేశ మంత యేసు
మనసుతో నాశతో సేవించుడి‖ దేశ ‖
Verse
నీతి న్యాయంబులు గలిగియు నిష్ఠలందు మెలఁగియు నిత్య ప్రేమ
చూపి యేసు నిష్ఠ లేక మేలు లేదు‖ దేశ ‖
Verse
వినయశక్తి నెంతగా వివ రించిన బోధించిన విశ్వ విభుండౌ యేసు
వినయ విధము లేక మేలు లేదు‖ దేశ ‖
Verse
ప్రేమఁ గలగి పరమ సత్య ప్రేమ సేవఁ జేయుఁడి ప్రేమమూర్తి యేసుకీస్తు
ప్రేమలలో వర్ధిల్లుఁ డిలలో‖ దేశ ‖
Verse
ఆసేతు హిమాచల ప ర్యంతమున్ దిగంతము లేకముగను దివిని
భువిని సేలు రాజు యేసుఁడే‖ దేశ ‖