Verse
దేవ దాసపాలక రాజా రావే
జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా
దేవా దేవా దీన పోషకా‖ దేవ ‖
Verse
లోక బాధ ఇరుకు శోధన నుండి
స్వీకరించినావు త్రియేక దేవుడా
స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ‖ దేవ ‖
Verse
దిక్కులేని పాపి కొరకు నీ దేహం
మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా
జయం జయం జయము నొందగా‖ దేవ ‖
Verse
కఠినులంత కుటిలము జేసి నిన్ను
గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరా
యిదే నా యెడ బ్రేమ జూపితి‖ దేవ ‖
Verse
ఇంత యొర్పు యింత శాంతమా నాకై
పంతముతో బాపికొరకు బ్రాణమియ్యగా
పాపి నీదగు దాపు జేర్చవే‖ దేవ ‖
Verse
కలువరి గిరి వరంబున నాకై
తులువను నా కొరకు నిలను సిల్వ మోయగా
హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయ ఆమెన్‖ దేవ ‖