Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Daasapaalaka Raajaa Raave Jeevamula Pa

దేవ దాసపాలక రాజా రావే జీవముల ప

Deva Daasapaalaka Raajaa Raave Jeevamula Pa

Verse
దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై ప్రకాశ మొందఁగా
దేవా దేవా దీన పోషకా‖ దేవ ‖
Verse
లోకబాధ యిరుకు శోధన నుండి స్వీకరించినావు త్ర్యేకదేవుఁడా స్తోత్రం
స్తోత్రం స్తోత్ర మర్పణ‖ దేవ ‖
Verse
దిక్కు లేని పాపికొరకు నీ దేహం మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా
జయం జయం జయము నొందఁగా‖ దేవ ‖
Verse
కఠిను లంత కుటిలముజేసి నిన్నుఁ గట్టి కొట్టి నెట్టి నీకుఁ గొయ్య నెత్తిరా
యిదే నా యెడఁ బ్రేమఁ జూపితి‖ దేవ ‖
Verse
ఇంత యోర్పు యింత శాంతమా నాకై పంతముతోఁ బాపికొరకుఁ బ్రాణ
మియ్యఁగా పాపిన్ నీదగు దాపుఁ జేర్చవే‖ దేవ ‖
Verse
కలువరి గిరి వరంబున నాకై తులువను నా కొరకు నిలను సిల్వమోయఁగా
హలెలూయా హలెలూయ హలెలూయ ఆమేన్‖ దేవ ‖

Related Tags

PraiseWorshipDevotional