Chorus
దేవ! దీనపాపిని ఓ పావన గావు కృపా బహుళ్యము చేత‖ దేవా ‖
Verse
ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంబె మలినత్వమును బాపి మాన్యు
జేయవె తండ్రీ!‖ దేవ ‖
Verse
నీకు కేవలంబు నీకే విరోధముగ ప్రాకొని నే ఘోర పాపం బొనర్చితిని‖ దేవ ‖
Verse
నాయతిక్రమ మెప్డు నా యెదుట నున్నది నా యెదను భారంబై నను
ద్రుంచుచున్నది‖ దేవ ‖
Verse
పాపంబులోనే యు ద్భవించినాడను పాపంబులోనే గ ర్భము దాల్చినది
తల్లి‖ దేవ ‖
Verse
ఎదయందు సత్యంబే యెడఁగోరు చుందువు హృదయమందున జ్ఞాన
మొదవ జేతువు నాకు‖ దేవ ‖
Verse
కలిగించు నాలో ని ర్మల శుద్ధ హృదయంబు నిలుకడైన మనసు
నిలుపు మాంతర్యమున‖ దేవ ‖
Verse
త్రోసివేయకు నన్ను నీ సన్నిధి నుండి తీసివేయక నుంచు మీ
శుద్ధాత్మను నాలో‖ దేవ ‖
Verse
నీ రక్షణానంద మో రక్షకా మరల చేరదీసి యిచ్చి స్థిరపరచు నా
మనసు‖ దేవ ‖
Verse
కావవే కర్తార క్తాపరాధమునుండి కావు నే నుత్సాహ గానంబుఁ
జేసెద‖ దేవ ‖
Verse
ప్రభువ! నా నోరునిన్ ప్రస్తుతించుచు సదా విభవముగఁ గొనియాడ
విప్పు నా పెదవులను‖ దేవ ‖
Verse
కోరువాఁడవు కావీ వారయ నర్పణలు కోరిన నర్పింతు కోటి బలులు
నీకు‖ దేవ ‖
Verse
విఱిగిన మనసే నీ విలసిత యర్పణము అరయ నలిగిన హృదయ
మతి ప్రియంబౌ నీకు‖ దేవ ‖