Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Divyanantha Prabhavamaampahi

దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి

Deva Divyanantha Prabhavamaampahi

Lyricist: Purushothamu Choudari
Chorus
దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి ఘన యెహోవా
స్థావర జంగమ సహిత నిఖిల జగ దావన పావన భావ నిరంతర‖ దేవా ‖
Verse
సార కారుణ్యపారా వారా సర్వజ్ఞ నిర్వి కారా యేసు
నామావతారా దీన జనోపకారా ఘోరమైన సంసారటవిఁ
బడి దారిఁ గనని ననుఁ జేరఁబిలిచితివి‖ దేవా ‖
Verse
అక్షీణ విభవానంద మోక్ష రాజ్య మహిమాధ్యక్ష సంతత
సుజన రక్షా కపట దుర్మనుజ శిక్షా పక్ష విపక్ష విలక్షణ రహిత
కటాక్షము నాదెస దీక్షను నిలుపవె‖ దేవా ‖
Verse
సుందరాశ్చర్య గుణ బృందా బంధుర నిత్యానందా సాధు
సజ్జన వంద్యా ఖందిత కలుష బృందా మంద మతిని నా
దెందము కడుఁదెలి వొందఁ జేసి నీ యందు నిలుపఁ గదె‖ దేవా ‖
Verse
నీవు నన్ను సృష్టించి నావు నా గురురాడ్దేవుఁ డవు క్రీస్తు యేసుని
చావు వలన నన్మనిపి నావు పావన జనక సుతాత్మలతోడను
గేవల మొక్కఁడ వై వెలిఁగెడి ప్రభు‖ దేవా ‖
Verse
ప్రేమ స్వరూప నిత్య క్షేమ పతిత పావన నామ దాస లోకాబ్ధి
సోమ సర్వేశ పరమ ధామ నేమ మెఱుంగని నీచుఁడ
నధముఁడ నోమహాత్మ దయతో మన్నింపవె‖ దేవా ‖

Related Tags

WorshipGodGlory