Verse
దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము
మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము‖ 2x ‖
మా యజమానివి నీవై మమ్ములను నడిపించు
నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు‖ 2x ‖
వందనములు అందుకో మా యేసయ్యా
కలకాలం నీ కాపుదలే కావాలయ్యా‖ 2x దేవా ‖
Verse
నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా
పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్యా‖ 2x ‖
ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్యా
నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా‖ వందనములు ‖
Verse
నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా
నీ నీడలో మే సాగుటకు మా గృహమును కట్టుమయా‖ 2x ‖
శోధన వేదనలెదిరించే బలమును అందించుమయ్యా
నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయ్యా‖ వందనములు ‖
Verse
నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి
నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి‖ 2x ‖
సమాధాన కర్తవు నీవై మా తోడుగా నీవుండాలి
కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి‖ వందనములు ‖