Chorus
దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా‖ దేవ ‖
Verse
వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా‖ దేవ ‖
Verse
పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు‖ దేవ ‖
Verse
వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవే యేసు నామావతారా‖ దేవ ‖
Verse
భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు వాఁడా‖ దేవ ‖
Verse
కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము వాని చే తిని వీడ వలదు‖ దేవ ‖
Verse
మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా‖ దేవ ‖