Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Maa Gruhambunu Sadayundavai Deeva

దేవా మా గృహంబును సదయుండవై దీవ

Deva Maa Gruhambunu Sadayundavai Deeva

Lyricist: Dasari Moses
Chorus
దేవా, మా గృహంబును సదయుండవై దీవించుటకు రారమ్ము నీవె
యిద్దానిని నెఱదాతవగుచు స ద్భావముతో నిచ్చితివి బహుమానముగ
మాకు‖ దేవా ‖
Verse
మా యింటి యజమానుండ వీవెసుమ్మి మా యింటి ప్రభుఁడ వీవె
పాయక మా యింట భవదీయాభీష్టంబె శ్రేయోదాయకమగుచు సిద్ధిం
చెడును గాక‖ దేవా ‖
Verse
మా యాస్తిపాస్తులన్ని మా కబ్బె భవ దీయానుగ్రహ బలముచే
నీయాననవ్వాని నీ యలఘ సేవకై న్యాయముగ నర్పింప నీయవె ఘన
బుద్ధి‖ దేవా ‖
Verse
నీవిచ్చు ధననిధులైన మా బిడ్డలు కేవలము నీ దాసులై భావివానిరి
మణుల ఠేవనుద్భాసిల్ల నీవెవారిని భృశము ప్రోవుమాయువొసంగి
దేవా‖ దేవా ‖
Verse
రేపుమాపీ గృహునఁ బ్రోక్తములగుచు దీవించు ప్రార్థనముల
లోపరహితంబులుగా ధూపధూమములట్లు నీ పాదయుగళి స మీపింప
నిమ్మెపుడు‖ దేవా ‖
Verse
ఏ రోగమును నెపుడేని మా మందిరపు ద్వారంబు చొరనీయక
ఆరోగ్యభాగధే యంబిచ్చి మమ్ములను భూరికృపబ్దివై పోసింపుమను
దినము‖ దేవా ‖
Verse
ఇరుగుపొరుగు వారలతో సమాధాన పరతవసింపను నేర్పి కొఱగాని
కలహములు త్వరపెట్ట నవ్వాని భరియింపఁదగు సహాన భావంబు మా
కిమ్ము‖ దేవా ‖
Verse
బీదసాదల కెల్లరకు మా గృహమెప్పు డాదరణాస్పదమై యుండ నీ
దానాసారంబు నెఱవర్షించిన కొలఁది నౌదార్యగుణము మా యందుఁ
బెంచుము సొరిది‖ దేవా ‖
Verse
నక్కలకు బొరియలుండు దివి పక్షులకుఁ జక్కని గూళ్లునమరు
నొక్కింత యిక్కనా కెక్కడలేదనిన చక్కని నరసుతమా సదనంబు నకు
రమ్ము‖ దేవా ‖

Related Tags

PrayerBlessingHome