Verse
దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా
పది వేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా‖ 2x ‖
Verse
వెలిశావు భువిలో మెస్సయ్యగా - ఎడారి బ్రతుకులో సెలయేరుగా‖ 2x ‖
నిస్సారమైనా నా జీవితములో చిగురించె ఆనందము
Verse
వెదికాను నీ దరి ఒంటరినై - నిలిచాను నీ దరి అన్వేసినై‖ 2x ‖
నీ దివ్య మార్గం చూపించినా ఫలియించె నా జన్మము