Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Na Deva Ninnu Keerthinchedan

దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్

Deva Na Deva Ninnu Keerthinchedan

Verse
దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్
దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్‖ 2x ‖
నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్
నీ నామమునే ఘనపరచెదన్‖ 2x ‖
హల్లెలూయ హల్లెలూయ యేసయ్యా
హల్లెలూయ హల్లెలూయ హోసన్నా‖ 2x ‖
Verse
పనికిరాని నన్ను నీవు
ఉపయోగ పాత్రగ మలచితివే‖ 2x ‖
నీదు కృపతో నను రక్షించిన
దేవా నీకే వందనము‖ 2x హల్లెలూయ ‖
Verse
నీదు ప్రేమతో నను ప్రేమించి
నూతన జీవితం ఇచ్చితివి‖ 2x ‖
నీవు నాకై చేసావు త్యాగం
దేవా నీకే వందనము‖ 2x హల్లెలూయ ‖
Verse
నిన్ను నమ్మిన నీ ప్రజలకు
అండగా నీవు నిలచితివి‖ 2x ‖
మాట తప్పని నిజమైన ప్రభువా
దేవా నీకే వందనము‖ 2x హల్లెలూయ ‖

Related Tags

PraiseWorshipThanksgiving