Chorus
దేవా నా దేవుడవు నీవే - వేకువనే నిన్ను వెదకుదును
Verse
నీ ప్రభావ బలమును చూడ - నీ పరిశుద్ధాలయమందు
నే నెంతో ఆశ తోడ - నీ వైపు కాచియున్నాను
Verse
నీళ్లు లేక యెండిన చోట - నా ప్రాణము నీ కొరకు
దాహము గొని యున్నది - నీ మీద ఆశచేత
Verse
నిను చూడ నా శరీరం - కృశించి పోవుచున్నది
నీ కృప జీవముకంటె శ్రేష్ఠం - నా పెదవులు నిన్ను స్తుతించున్
Verse
నా పడక మీద నిను దలచి - రాత్రి జాములో ధ్యానించునపుడు
క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లు - నా ప్రాణము తృప్తి నొందుచున్నది
Verse
ఉత్సాహముతో నా నోరు - నిన్నుగూర్చి పాడుచున్నది
నా జీవిత కాలమంత - ఈలాగున నిన్ను స్తుతియించెదన్
Verse
నా సహాయుడా నీ పేరు - బట్టి నా చేతు లెత్తెదను
నీ చాటున శరణు జొచ్చి - ఉత్సాహధ్వని చేసెదను
Verse
నను చంప వెదకెడి వారు - పాతాళమునకు పోయెదరు
ఖడ్గంబునకు గురియై - మరి నక్కలపాలగుదురు
Verse
దేవుని బట్టి రాజానందించున్ - తన తోడు ప్రమాణము చేయు
ప్రతివాడు అతిశయించును - మూయబడు నబద్ధికుల నోరు