Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Naa Hrudayamu Neeyandu Sthiramayen

దేవా నా హృదయము నీయందు స్థిరమాయెన్

Deva Naa Hrudayamu Neeyandu Sthiramayen

Verse
దేవా నా హృదయము - నీయందు స్థిరమాయెన్
నే పాడుచు స్తుతించున్ - నా యాత్మ గానము చేయున్
Verse
స్వరమండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడా
వేకువనే నే లేచెదను - స్తుతిగానము చేసెదను
Verse
దేవా నీ జనముల మధ్య - కృతజ్ఞతా స్తుతులను
చెల్లించి ప్రజలలోన - స్తుతిగానము చేసెదను
Verse
ఆకాశమున కంటె నీ - కృప మహోన్నతమైనది
నీదు సత్యము మేఘములకంటె - అత్యున్నతమైనది
Verse
దేవా నీ వాకాశముకంటె - మహోన్నతుడవు కమ్ము
నీదు మహిమ సర్వభూమి - మీద వ్యాపించును గాక

Related Tags

PraiseWorshipPsalm