Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Naadeva Nannela Vidachithivani Siluvalo Baliyaina Naa Yesuva

దేవా నాదేవా నన్నేల విడచితివని సిలువలో బలియైన నా యేసువా

Deva Naadeva Nannela Vidachithivani Siluvalo Baliyaina Naa Yesuva

Verse
దేవా నాదేవా నన్నేల విడచితివని
సిలువలో బలియైన నా యేసువా
పలుబాధ లొందితివి నా శైలమా
Verse
నా తండ్రి నీకిది సాధ్యమైతే
ఈ గిన్నె నానుండి తొలగింపుమని
నా నాథా తండ్రిని వేడితివా
నే మోయలేని ఈ భారమంత
నీవు గాక యెవరు భరింతురు
Verse
నీ శిష్యులంతా యేమైపోయిరి
నీవు స్వస్థపరచిన రోగులేరి
నీ తండ్రికూడా నిను విడనాడెనా
నా దోషమంతా నీపై మోపెనా
నిను నలుగగొట్టుట కప్పగించెనా
Verse
నిన్ను రచ్చకీడ్చను నా రక్షకా
నీ నేరమేమిటి ఓ నా ప్రభువా
మానవులు దేవుని చంపుటయా?
ఏ చరితంబులోనూ కలదా ప్రభూ?
ఈ ఘోరమరణము నాకై నొందితివా?
Verse
సొగసైన షారోను ఓ పుష్పమా
సురూపమంతా కోల్పోయితివా
వ్యసనా క్రాంతుడవైతివా నా కై
వ్యాధిని అనుభవించితివి నాకై
వధియింప బడితివి బలి పశువుగా

Related Tags

Good FridayPassionCrucifixion