Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Naayandu Neeku Entho Prema

దేవా నాయందు నీకు ఎంతో ప్రేమా

Deva Naayandu Neeku Entho Prema

Chorus
దేవా నాయందు నీకు - ఎంతో ప్రేమా
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
హల్లెలూయ ...‖ 4x ‖
Verse
దిన దినము నీదు ప్రేమ - రుచిచూచుచున్నాను
దయగల జీవాహారముతో - పోషించుచున్నావు
దేవా! నీ జీవ జలము - నాకిచ్చితివే
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
Verse
నా పాదములను నీవు - బండపై నిలిపితివి
నా యడుగుల నెల్ల నీవు - స్థిరపరచిన దేవుడవు
దేవా! నా కాశ్రయుడవు - నీవే కదా
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
Verse
సిలువలో నీ రక్తము కార్చి - నన్ను రక్షించితివి
సార్వత్రిక సంఘములోన - నన్నైక్య పరచితివి
దేవా నీ దయ నా యెడల - అత్యున్నతము
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
Verse
వాగ్దానములను నాలో - నెరవేర్చిన ఓ ప్రభువా
విదువక నా యెడల నీదు - కృప జూపుచున్నావు
దేవా! నీ మారని ప్రేమ - సంపూర్ణము
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
Verse
మృతిని గెల్చి మాకొరకై - తిరిగి లేచిన ప్రభువా
మా కొరకై త్వరలో రానై - యున్న మహిమ రాజా
దేవా! నీ సన్నిధి నాకు - ఎంతో ప్రియము
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

Related Tags

WorshipGraceGods Love