Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Nee Aathmanu

దేవా నీ ఆత్మను

Deva Nee Aathmanu

Lyricist: Dino
Verse
దేవా నీ ఆత్మను నా నుండి
నువ్వు తీసివేయకుమా
నీ సన్నిధిలో నుండి నన్ను
నువ్వు త్రోసివేయకుమా‖ 2x ‖
నీ దృష్టి యెదుటనే
చెడుతనము చేసియున్నాను
పాపిని అని ఒప్పుకొని
క్షమాపణ కోరుచున్నాను
నీవే నీవే కరుణామయుడవు నీవే
నీవే నీవే ప్రేమామయుడవు నీవే‖ దేవా ‖
Verse
నీ వెలుగుతో నను నింపిననూ
చీకటినే కోరుకున్నాను‖ 2x ‖
నా కళ్ళు నీవు తెరిచిననూ
గ్రుడ్డివాడిలా నడుచుకున్నాను‖ నీ దృష్టి ‖
Verse
నీ ఆత్మతో నను నింపిననూ
శరీరమునే తృప్తిపరిచాను‖ 2x ‖
ఆత్మచేత నడిపించబడక
శరీరాశలలో మునిగాను‖ నీ దృష్టి ‖

Related Tags

PrayerRepentanceForgiveness