Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Nee Aavaranam

దేవా నీ ఆవరణం

Deva Nee Aavaranam

Lyricist: Songs Of Zion
Verse
దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం‖ 2x ‖
ఒక ఘడియ యిచట గడుపుట మేలు
వేయి దినములకంటెను‖ 2x దేవా ‖
Verse
అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ….‖ 2x ‖
అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా
అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో‖ 2x ‖
ఆల్ఫా ఓమేగయు ఆత్మ రూపుడవు
ఆనందించగ నీ ఒడిలో‖ 2x దేవా ‖
Verse
అత్యంత పరిశుద్ధమౌ ఆ…. నీదు గుడారమున ఆ…..‖ 2x ‖
నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్
జు౦టె ధారల కన్నను తేనె మధురిమ కన్నను‖ 2x ‖
శ్రేష్టమౌ నీదు వాక్కులచేత
మము తృప్తి పరచుమయా‖ 2x దేవా ‖
Verse
పరిశుద్ధ సన్నిధిలో ఆ… పరిశుధ్దాత్ముని నీడలో ఆ….‖ 2x ‖
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం
మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం‖ 2x ‖
ప్రాణ ప్రియుడవు పదముల జేరి
ప్రాణార్పణము చేతుము‖ 2x దేవా ‖

Related Tags

PraiseWorshipDevotional