Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Nee Goppakaaryamulan - Madin Thalachi Sthuthinchedam

దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం

Deva Nee Goppakaaryamulan - Madin Thalachi Sthuthinchedam

Verse
దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం
నీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదం
హల్లెలూయా నా యేసురాజ
హల్లెలూయా నా ప్రాణనాథ‖ 2x ‖
స్తుతులు మహిమ ఘనత నీకే‖ 2x దేవా నీ ‖
Verse
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
పరమును వీడి భువికరుదెంచి
కలువరి సిలువలో రక్తము కార్చి
నీదు కృపతో నను రక్షించిన
నీ దివ్య ప్రేమను అత్యధికముగా
స్మరింతున్ జీవిత కాలమంతా‖ దేవా నీ ‖
Verse
నీ కంటిపాపగా నన్ను కాచి
నీ చేతి నీడలో నన్ను దాచి
నీ అరచేతిలో నను చెక్కుకొని
నీదు సొత్తుగా నను చేసుకొని
అక్షయమైన నీ మధుర ప్రేమను
దీక్షతో ఇలలో చాటెదను‖ దేవా నీ ‖

Related Tags

PraiseWorshipThanksgiving