Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Nee Krupa Nirantharam Maaranidepudu Naa Prabhuvaa

దేవా నీ కృప నిరంతరం మారనిదెపుడు నా ప్రభువా

Deva Nee Krupa Nirantharam Maaranidepudu Naa Prabhuvaa

Chorus
దేవా! నీ కృప నిరంతరం - మారనిదెపుడు నా ప్రభువా
నిత్యజీవము గలది ప్రియ ప్రభువా .....
దేవా! నీ కృప నిరంతరం
Verse
పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధపరచెను నీ కృపయే‖ 2x ‖
పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలిచితివే‖ 2x దేవా ‖
Verse
రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే‖ 2x ‖
నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే‖ 2x దేవా ‖
Verse
విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే‖ 2x ‖
శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే‖ 2x దేవా ‖
Verse
కృపలో నడుపుము ఓ దేవా - కృపతో నింపుము నా ప్రభువా‖ 2x ‖
నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము‖ 2x దేవా ‖

Related Tags

WorshipDevotionalGrace