Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Nee Mukhamunu Naaku Daachakumu Naa Prabhuva

దేవా నీ ముఖమును నాకు దాచకుము నా ప్రభువా

Deva Nee Mukhamunu Naaku Daachakumu Naa Prabhuva

Verse
దేవా నీ ముఖమును నాకు - దాచకుము నా ప్రభువా
నీ సేవకుని కోపముచే - త్రోసివేయకు యెహోవా
Verse
దేవా నా రక్షణకర్త - నీవే నాసహాయుడవు
నన్ను దగనాడవలదు - నన్ను విడువకుము
Verse
నాదు తలిదండ్రులు - నన్ను విడచినను
నా దేవుండగు యెహోవా - నన్ను చేరదీయును
Verse
నాకై పొంచియున్నట్టి - వారిని చూచి నన్ను
సరళ దారిని నడుపు - మంచి మార్గము భోధించు
Verse
నాపై లేచియున్నారు - అబద్ధ సాక్షులు క్రూరుల్
నన్నప్పగించకు దేవా - నాదు విరోధులకు
Verse
యెహోవా దయ పొందెదను - సజీవుల దేశమున
ఇట్టి నమ్మకము లేని - యెడల నే నేమగుదును
Verse
ధైర్యము తెచ్చుకొని - నిబ్బర హృదయము గల్గి
యెహోవా దేవుని కొరకు - కనిపెట్టుకొని యుండుము

Related Tags

WorshipPrayerPsalm