Verse
దేవా నీ సాక్షిగా నేనుండుట
ఈ మంటికి భాగ్యము‖ 2x ‖
జాలిగా మానుజాళికై
కలువరిలోని ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు
నా తుది శ్వాస ఆగే వరకు‖ దేవా ‖
Verse
నాలాంటి నర మాత్రుని చేరుట
నీ వంటి పరిశుద్ధునికేలనో‖ 2x ‖
ఏ మేధావికి విధితమే కాదిది
కేవలం నీ కృపే దీనికాధారము
ఈ సంకల్పమే నా సౌభాగ్యమే
నా బ్రతుకంత కొనియాడుట‖ దేవా ‖
Verse
నా ఊహకందని మేలుతో
నా గుండె నిండింది ప్రేమతో‖ 2x ‖
నా కన్నీటిని మార్చి పన్నీరుగా
నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
ఈ శుభవార్తను చాటు సందేశము
నేను ఎలుగెత్తి ప్రకటించెద‖ దేవా ‖