Verse
దేవా నీ సన్నిధిలో నిలచి
దీనులమై మొరపెట్టుచున్నాము‖ 2x దేవా ‖
Verse
అపరాధులగు నీదు ప్రజల
నెపములన్నియు బాపి‖ 2x ‖
కృపాళుండగు యేసు ప్రభువా
కృపను జూపి రక్షించుమయా‖ 2x దేవా ‖
Verse
చేసి యున్నాము నేరములెన్నో
చేసిన మేలులను మరచి‖ 2x ‖
మోసములలో బడియున్నాము
యేసుప్రభు జయమునిమ్ము‖ 2x దేవా ‖
Verse
లోకపు మర్యాదలకు లొంగి
లోకుల మాటలను వినియు‖ 2x ‖
నీ కట్టడలను మరచితిమి
కట్టుము మమ్ము నీ వాక్యముచే‖ 2x దేవా ‖
Verse
నిస్వార్థులగు నీ దాసులను
విశ్వాస ప్రమాణికులన్‖ 2x ‖
శాశ్వతమైన ప్రేమతో నింపు
విశ్వాసులు స్థిరపడి నడువ‖ 2x దేవా ‖
Verse
సహవాసములో మమ్ము నిలిపి
సహనము మాకు నేర్పించి‖ 2x ‖
మహిమా పూర్ణుడ యేసు నిన్ను
ఈ మహిలో చాటించుటకు‖ 2x దేవా ‖