Verse
దేవా నీ సన్నిధిలో నిలచి
దీనులమై మొరపెట్టుచున్నాము
Verse
అపరాధులగు నీదు ప్రజల నెపములన్నియు బాపి
కృపాళుండగు యేసు ప్రభువా కృపను జూపి రక్షించుమయా
Verse
చేసి యున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి
మోసములలోబడియున్నాము యేసుప్రభు జయమునిమ్ము
Verse
లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు
నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ము నీ వాక్యముచే
Verse
నిస్వార్థులగు నీ దాసులను విశ్వాసప్రమాణికులన్
శాశ్వతమైన ప్రేమతోనింపు విశ్వాసులు స్థిరపడి నడువ
Verse
సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి
మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈమహిలో చాటించుటకు