Verse
దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం నీ కుడి హస్తములో
నిత్య సుఖములు కలదు
నాకు క్షేమాధారం కాపాడే నా దేవా
నీకేనా వందనము నీకేనా స్తోత్రములు
స్తోత్రరూపమగు నా క్రొత్త గీతములు
నా నోటనుంచావు నా యేసయ్యా‖ 2x ‖
Verse
దేవా నీ కృపలోనే వర్ధిల్లే నా జీవం
అనుదినము నీకొరకే సాక్షిగనేనుండెదను
నాకు విరోధముగా రూపింపబడిన
ఏ విధ ఆయుధము వర్ధిల్లనేరదు‖ స్తోత్రరూపమగు ‖
Verse
దేవా నీ వాక్యము వెల్లడియగుతోడనే
జీవితమంతయు వెలుగు కలుగుచుండ
దినదినము నా భారం
భరియించు నా దేవా
నీకేనా వందనము నీకేనా స్తోత్రములు
స్తోత్ర రూపమగు‖ స్తోత్ర రూపమగు ‖