Verse 1
Reference: దేవా! నీ తలంపులు నాకెంత ప్రియమైనవి కీర్తన Psalm 139:17
Chorus
దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది
Verse
స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే - స్తుతి పాడెద హృదయముతో
స్తుతించి వర్ణించి ఘనపరతున్ - నీవే నా రక్షకుడవని
Verse
మొదట నిన్ను యెరుగనైతిని - మొదటే నన్ను యెరిగితివి
వెదుకలేదు ప్రభువా నేను - వెదకితివి యీ పాపిని
Verse
మరణమగు వూబిలో నుంటిని - కరుణ నిలిచె నన్ను రక్షింప
మరణము నుండి రక్షింప నన్ - నా ప్రభు బలియాయెను
Verse
పాపలోకములో మునిగి యుంటిని - పాప శిక్షకు పాత్రుడను
యేసు ప్రభు సిలువ సహించెను - నాకు నూతన జీవ మొసగ
Verse
అద్భుతమైనది సిలువ దృశ్యం - ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి
ప్రభువును వర్ణింప నశక్యము - ప్రభువే సహించె దుఃఖము
Verse
యెట్లు మౌనముగా నుందు ప్రభూ - చెల్లింపక స్తోత్ర గీతము
కాలమంతా పాడుచుండెద - నీ ప్రేమ అపారమైనది