Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Nee Thalamputhu Naa Kentho Priyamu Entho Priyamu

దేవా నీ తలంపులు నా కెంతో ప్రియము ఎంతో ప్రియము

Deva Nee Thalamputhu Naa Kentho Priyamu Entho Priyamu

Chorus
దేవా! నీ తలంపులు నా - కెంతో ప్రియము ఎంతో ప్రియము
వాటిమొత్తము దాసుడనగునే - నెంచి చెప్పెద గొప్పది గొప్పది
Verse
పాతాళపు పాశములు - నన్ను అరికట్టగా
ఆవరించె మరణ ఉరులు
క్రుంగిపోతినో దేవా - క్రుంగిపోతినో దేవా‖ 2x ‖
ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
అందుకే నే పాడెద - కీర్తించెద‖ Keerthincheda ‖
Verse
నా మీదికి లేచువారు - నన్ను బెదరించెడు వారు
దేవ్వ నీ రక్షణ నా నుండి
దాటిపోయెననె వారు - దాటిపోయెననె వారు‖ 2x ‖
ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
అందుకే నే పాడెద - కీర్తించెద‖ Keerthincheda ‖
Verse
నీవే నా కాపరి నంటివి - కాపుదలలో రాలేక యుంటిని
పాపినై యుండి పాపమెరుగనంటి
శాపగ్రస్తుడనైతి దేవా - శాపగ్రస్తుడనైతి దేవా‖ 2x ‖
ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
అందుకే నే పాడెద - కీర్తించెద‖ Keerthincheda ‖
Verse
మూతవేసిన నా మూర్ఖతయును - దాగియుండిన నా పాపమును
విప్పిచూపి శిక్షింపనంటివి
కక్షలేని నా దేవా - కక్షలేని నా దేవా‖ 2x ‖
అర్హతలేనివాడను - సర్వము పోయినవాడను
అందుకే నే పాడెద - కీర్తించెద‖ Keerthincheda ‖
Verse
నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లును
శ్రమపొంది యుండుట నాకు
మేలని నేర్పించితివి - మేలని నేర్పించితివి‖ 2x ‖
నీ ధర్మ శాస్త్రము నాకు ప్రియము - దినమెల్ల నేను
ధ్యానింతును అందుకే నే పాడెద - కీర్తించెద‖ Keerthincheda ‖
Verse
పర్వతములు తొలగిపోయినను - తత్తరిల్లిన మెట్టలు మట్టమై
ఒట్టుపెట్టుకొని నేను చెప్పెద
విడచిపోదు నిన్ నాదు కృప - విడచిపోదు నిన్ నాదు కృప‖ 2x ‖
నీ వాగ్దానములకే నా స్తోత్రము - నా ఆర్తధ్వనులు
నా హృదయ ధ్యానం - అంగీకరించు దేవా - కీర్తించెద‖ Keerthincheda ‖
Verse
నేను చేయునది ఇపుడు - నీవు ఎరుగజాలవనె
తెలిసికొందువు నీవు ఇక ముందుకు
నా పరిపూర్ణ మార్గమిదే - నా పరిపూర్ణ మార్గమిదే‖ 2x ‖
వింటిని నే నీ స్వరము - కంటిని నే నీ రూపము
హల్లెలూయ పాడెద - కీర్తించెద‖ Keerthincheda ‖

Related Tags

WorshipPrayerPsalm