Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Nee Yavaranam Maakentho Shreyaskaram

దేవా నీ యావరణం మాకెంతో శ్రేయస్కరం

Deva Nee Yavaranam Maakentho Shreyaskaram

Verse
పల్లవి:
దేవా నీ యావరణం మాకెంతో శ్రేయస్కరం
ఒక ఘడియ యిచ్చట గడుపుట మేలు వేయిదినములకంటెను (2X)‖ 2x Deva ‖
Verse
అద్భుత కార్యములు ఆ.. జరిగించు దేవుడవు ఆ..
ఘనవారసకుని మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా
ఆత్మతొ సత్యముతో ఆరాధించగ మనస్సుతో
అల్ఫా ఒమేఘయు ఆత్మరూపుడవు ఆనందించగ నీ మదిలో‖ Deva ‖
Verse
పరిశుద్ధ సన్నీధిలొ ఆ.. పరిశుద్ధాత్ముని నీడలొ ఆ..
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం
మా దేహమే ఆలయం - కావాలి మీకే నిలయం
ప్రాణప్రియుడవు - పదముల జేరి ప్రాణార్పణము జేతును‖ Deva ‖
Verse
అత్యంత పరిశుద్ధమౌ ఆ.. నీదు గుడారమున ఆ..
నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్
జుంటిధారల కన్నను - తేనే మధురిమలకన్నను
శ్రేష్టమౌ నీదు వాక్కుల చేత - మమ్ము తృప్తీ పరచుము‖ Deva ‖

Related Tags

PraiseWorshipDevotional