Chorus
దేవ నీవు నన్ను ఁ బరిశో ధించి బాగుగఁ దెలిసికొంటివి నీ వెఱుఁగు
దువు నేను కూర్చుండుటయును నే లేచుటయును‖ దేవ ‖
Verse
నాకుఁ దలఁపులు పుట్టినపుడే నా మనస్సు గ్రహించి నాఁడవు
ప్రాకటంబుగ నా నడక నా పడకను బరిశీలించితి‖ దేవ ‖
Verse
నీకు నా సమస్త చర్యల నిజము తెలియును, మాట నాల్కకు రాకపూర్వము
దేవ సర్వముఁ బూర్తిగా నీకే తెలియును‖ దేవ ‖
Verse
నా వెనుకను ముందు నుండి నన్ను నావరిఁచి నీ చెయ్యి నీవు నాపయి
నుంచితివి నా మది కది కేవల మందదు‖ దేవ ‖
Verse
అరుగుదెంచెద నెచ్చటికి నీ యాత్మ యొద్ద నుండి యింక నీ పరమ
సన్నిధి నుండి నే నెచ్చోటికిఁ బారిపోవుదు‖ దేవ ‖
Verse
ఏను వేకువ టెక్కలను ధరి యించి కడలిలో నున్న నీ చెయి మానక
నడిపించు నీ కుడి చేయియు మరి నను గైకొను‖ దేవ ‖
Verse
నను సృజించిన తెఱఁగెఱుంగఁగ నాకు భయ మాశ్చర్య మొదవును
గనుక నీకును నేఁ గృతజ్ఞతాస్తుతులను జెల్లింతును‖ దేవ ‖
Verse
నేను పిండం బైనయప్పుడు నీవు నను వీ క్షించినాఁడవు నేను బ్రతుకుట
ముందె లిఖితంబాయెను నీ గ్రంథంబులో‖ దేవ ‖
Verse
నిక్కముగ దేవా నీ తలఁపు లెక్కువ ప్రియ మగును నాకును లెక్కకు
నెక్కువౌ‖ దేవ ‖