Chorus
దేవా నిన్ను - నేను విడువను నన్ను దీ - వించు వరకు
Verse
నేటినుండి - మమ్ము నీవు ఆశీర్వదిం - చెద వంచు
మాదు హృదయ - కోర్కెలనెల్ల - సఫల పరచు - వాడ
Verse
లోతునుండి - అబ్రాహాము వేరుపడిన - విధముగా మమ్ము
లోకమునుండి - వేరుపరచిన - లోకనాథ - నీవేగా
Verse
అడవి బీడుల - యెడారిభూముల యేహోవ - తన హస్తములతో
ఏదేను తోటగా - నగునట్లు మార్పు జేయు - వాడ
Verse
సీయోనులో - నుండి నీవు మమ్ము నాశీర్వ - దించెదవు
ఇమ్ముగా మా - ప్రార్థన లెప్పుడు - ఆలకించు - వాడ
Verse
మాదు స్వాస్థ్య - మును నీవు వాక్యముతో - ప్రత్యక్షపరచి
ఆత్మీయ - పోరాటమునందు - జయము కూర్చు - వాడ
Verse
గుండె జారిపోవునట్లు మండిపడుచు - శత్రువురేగ
అండయై - మము ఆదరించు - బండయైన - క్రీస్తు ప్రభు
Verse
ఆదియంతము - లేని దేవా అల్ఫయు - ఓమేగయు నీవే
హల్లెలూయా స్తోత్రములకు - అర్హుడవు - నీవేగా