Chorus
దేవా సహాయము నిమ్మా జీవంపు టూటలు ద్రావుట కిమ్మా‖ దేవా ‖
Verse
గడియ గడియకు నెగసెఁ నమ్ము లెంతో వడిగా నాపై వచ్చె నరక
బాణములు ఎగతెగని శోధనములు నీవు పడఁగొట్టి వేగమె దృఢభక్తి‖ దేవా ‖
Verse
కోటాన కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చె మరి నికృష్టములు
సాతాను సాధనములు నేను దాఁటి నీ రెక్కల చాటున నుండ‖ దేవా ‖
Verse
దారా పుత్రుల పైన భ్రమలు నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములు
ఘోరమగు నాత్మకములు న న్నీ రీతి భ్రమ పెట్టు ధారుణిలోన‖ దేవా ‖
Verse
మా యావువుదినములు చెట్టు చాయవలెఁ దరుగుచు మంటి పాలౌను
చాలు నీ లోకంబు మేలు మేము పరలోకరాజ్యము చేరుట మేలు‖ దేవా ‖
Verse
మంచి మరణం బిమ్ము దేవ మమ్ము వచించు సాతాను వల నుండి
కావ నెంచి దూతల నంపినావ మాకై పంచగాయములొంద ప్రభు వచ్చినావా‖ దేవా ‖