Verse
దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా – నా యంతరంగము
లో వసించు నో సమస్తమా‖ దేవ ‖
Verse
జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు‖ 2x ‖
నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే‖ దేవ ‖
Verse
చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను‖ 2x ‖
జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే‖ దేవ ‖
Verse
యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త‖ 2x ‖
యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే‖ దేవ ‖
Verse
ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్‖ 2x ‖
విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే‖ దేవ ‖
Verse
అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు‖ 2x ‖
నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే‖ దేవ ‖
Verse
పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు‖ 2x ‖
భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే‖ దేవ ‖
Verse
పడమటికి తూర్పెంత ఎడమో – పాపములను మనకు నంత‖ 2x ‖
ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే‖ దేవ ‖
Verse
కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల‖ 2x ‖
యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే‖ దేవ ‖
Verse
మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి‖ 2x ‖
మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే‖ దేవ ‖
Verse
పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన‖ 2x ‖
వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే‖ దేవ ‖
Verse
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు‖ 2x ‖
నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే‖ దేవ ‖