Chorus
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ మంతుడగు యెహోవా సంస్తుతి
చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా
దేవుని పావన నామము నుతించుమా నా యంతరంగములో వసించు
నో సమస్తమా‖ దేవ ‖
Verse
జీవమా, యెహోవా నీకుఁ జేసిన మేళ్లన్ మరవకు నీవు చేసిన
పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండఁ జేయును ఆ
కారణముచే‖ దేవ ‖
Verse
చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను జీవ కిరీటముగ
వేయును నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే‖ దేవ ‖
Verse
యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త యౌవనంబై
వెలయునట్లుగా మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ
కారణముచే‖ దేవ ‖
Verse
ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయ మిచ్చున్ విభుండు
మార్గము తెలిపె, మోషేకుఁ దన కార్యములను విప్పె నిశ్రా
యేలు జనమునకు ఆ కారణముచే‖ దేవ ‖
Verse
అత్యధిక ప్రేమ స్వరూపియైన ధీర్ఘ శాంతపరుండు నిత్యము
వ్యాజ్యంబు చేయఁడు ఆ కృపోన్నతుఁడు నీ పయి నెపుడు కోప ముం
చఁడు ఆ కారణముచే‖ దేవ ‖
Verse
పామరుల మని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్ పంపలేదు భూమి
కన్న నాకసంబున్న యెత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున
ఆ కారణముచే‖ దేవ ‖
Verse
పడమటికిఁ దూర్పెంత యెడమో పాపములకును మనకు నంత
యెడము కలుగజేసియున్నాఁడు మన పాపములను ఎడముగానే
చేసియున్నాఁడు ఆ కారణముచే‖ దేవ ‖
Verse
కొడుకులపైఁ దండ్రి జాలి పడు విధముగా భక్తిపరుల యెడల జాలి
పడును దేవుండు తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు ఆ
కారణముచే‖ దేవ ‖
Verse
మనము నిర్మితమయిన రీతి తనకుఁ దెలిసియున్న సంగతి మనము
మంటి వారమంచును జ్ఞాపకముచేసి కొనుచు కఱుణ జూపుచుండును
ఆ కారణముచే‖ దేవ ‖
Verse
పూసి గాలి వీవ నెగిరి పోయి బసను దెలియని వన వాస పుష్పము
వలెనె నరుఁడుండు నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప
మెండు ఆ కారణముచే‖ దేవ ‖
Verse
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ భక్తితోఁ గైకొను జనులకు నిరతమును
గృప నిలిచి యుండును యెహోవా నీతి తరములు పిల్లలకు నుండును
ఆ కారణముచే‖ దేవ ‖