Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Samsthuthi Cheyave Manasa Srimanthudagu Yehova Samsthuthi

దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి

Deva Samsthuthi Cheyave Manasa Srimanthudagu Yehova Samsthuthi

Chorus
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి
చేయవే మనసా - దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా
దేవుని - పావన నామము స్తుతించుమా - నా యంతరంగము - లో
వసించు - నో సమస్తమా - ఆ కారణముచే‖ దేవ ‖
Verse
జీవమా యెహోవా నీకు - జేసినా మేళ్ళన్ మరువకు
నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు - లేవియున్
లేకుండ జేయును - ఆ కారణముచే‖ దేవ ‖
Verse
చావు గోతి నుండి నిన్ను - లేవనెత్తి దయను కృపను
జీవ కీరీటముగ వేయును - నీ శిరసు మీద - జీవ
కీరీటముగ వేయును - ఆ కారణముచే‖ దేవ ‖
Verse
యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనే క్రొత్త
యౌవనంబై వెలయునట్లుగ - మేలిచ్చి నీదు - భావమును
సంతుష్టి పరచునుగా - ఆ కారణముచే‖ దేవ ‖
Verse
ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయమిచ్చున్
విభుడు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే‖ దేవ ‖
Verse
అత్యధిక ప్రేమ స్వరూపి - యైన దీర్ఘశాంత పరుడు
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
నీపై నెపుడు కోపముంచడు - ఆ కారణముచే‖ దేవ ‖
Verse
పామరులమని ప్రత్యుపకార - ప్రతిఫలంబుల్ పంపలేదు
భూమి కన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - ప్రేమ
భక్త జనులయందున - ఆ కారణముచే‖ దేవ ‖
Verse
పడమటికి తూర్పెంత యెడమో - పాపములకున్ మనకు
నంత యెడము కలుగ జేసి యున్నాడు - మన పాపములను
యెడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే‖ దేవ ‖
Verse
కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తి పరుల
యెడల జాలి - పడును దేవుండు - తన భక్తి పరుల - యెడల
జాలి పడును దేవుండు- ఆ కారణముచే‖ దేవ ‖
Verse
మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి
మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి - కొనుచు
కరుణ జూపుచుండును - ఆ కారణముచే‖ దేవ ‖
Verse
పూసి గాలి వీవ నెరిగి - పోయి బసను దెలియని వన - వాస
పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ - ప్రాయము
మన దేవకృప మెండు - ఆ కారణముచే‖ దేవ ‖
Verse
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు
నిరతమును కృప నిలిచి యుండును - యెహోవా నీతి
తరముల పిల్లలకు నుండును - ఆ కారణముచే

Related Tags

PraiseWorshipThanksgiving