Chorus
దేవా సంవత్సరమును దయాకిరీటముగా నిచ్చి యున్నావు
దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నవి
Verse
నీ మీద నా దృష్టి నిలిపి - నీకాలోచన నే చెప్పెదను
అనిన మహోన్నతుడా
Verse
సతతము మీతో కూడా నేను - ఉన్నాననిన మా ప్రభు యేసు
అభయంబొసగిన మా
Verse
తలవెండ్రుకలు నెరయు వరకు - నేనే నిన్ను ఎత్తుకొనుచును
రక్షించెద ననిన
Verse
నీవే నాదు సొత్తని పిలచి - శాశ్వతముగ నిను ప్రేమించితిని
అనిన ప్రేమామయుడ
Verse
మా కాపరివై మాదు ప్రభుడవై - జీవజలముల చెంతకు మమ్ము
నిడిపించెద ననిన
Verse
పలువిధములగు బాధలు పొంది - రక్తము కార్చి ప్రాణము నిచ్చి
రక్షించిన మాదు
Verse
మా ప్రభుయేసు మహిమయు నీదే - నీ నామమున పాడెద మెపుడు
హల్లెలూయా ఆమెన్