Chorus
దేవా శిశువుల దెచ్చితిమి నీవు దీవించువీరల దివ్య కృపమీర‖ దేవ ‖
Verse
వీరు పొందిన బాప్తిస్మంబు గురుతు వీరు నీవా రన విశదపరపంగా
వీరిపైఁ గురిపించు దయను వేగ వీరికిఁ గలుగంగ విజ్ఞాన ధనము‖ దేవ ‖
Verse
నీ వొసఁగు శిశువుల మాకు దేవ నీవ చేర్చికొనుము నీవ కాపాడు జీవ
మార్గము నందు నిలుపు నిత్య జీవంబు దయచేసి శ్రీ యేసు కఠినన్‖ దేవ ‖
Verse
విమలాత్మ బాప్తిస్మ మొసఁగి వీరి విమలులఁ జేయుము ప్రీతిని దేవా
క్షమ భక్తిప్రేమ శాంతుల నొసంగు శ్రమముల వెలుఁగంగ సత్య
సాక్షులుగా‖ దేవ ‖
Verse
వీరలకుఁ దోడై యుండుము తండ్రి వీరలఁ జూడుము వివిధ మార్గ
ముల వీరు లోకము విడుచు నపుడు దయను వీరలఁ జేర్చుము విమ
లానందమున‖ దేవ ‖