Verse
దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే
Verse
మా దోషములను నీవు నీ యెదుట - నుంచుకొని యున్నావు
నీ ముఖకాంతిలో మా రహస్య పా-పములు కనబడుచున్నవి
Verse
మా దినములన్ని గడిపితిమి - నీ యుగ్రత భరించుచు
నిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము
Verse
డెబ్బది సంవత్సరములేగా - మాదు ఆయుష్కాలము
అధిక బలమున్న యెడల యెనుబది - సంవత్సరములగును
Verse
అయినను వాటి వైభవమంత - ఆయాసమే దుఃఖమే
అది త్వరగా గతించును మే-మెగిరి పోయెదము
Verse
నీకే జెందవలసినట్టి భయము - కొలది పుట్టినట్టి
నీదు ఆగ్రహ క్రోధ బలము - ఎవ్వరికి తెలియున్
Verse
మాకు నీ జ్ఞాన హృదయమును - కలుగునట్లు చేయుము
మాదినములు లెక్కించుటకు - మాకు నీవే నేర్పుము