Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Vembadinchithi Nee Naamamun Ja

దేవా వెంబడించితి నీ నామమున్ జ

Deva Vembadinchithi Nee Naamamun Ja

Lyricist: ఎ బి మాసిలామణి
Chorus
దేవా! వెంబడించితి నీ నామమున్ జీవితేశ్వర నా జీవితాశ నీవే రావె
నా భాగ్యమా యేసువా‖ దేవా ‖
Verse
యేసూ! నీదు ప్రేమను నే వింటిని భాసురంబగు నీ సిలువ నే గంటిని
యేసువాడను నే నంటిని‖ దేవా ‖
Verse
ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్ పరలోక యెరూషలేము పురికిన్
పావనా జూపుము మార్గము‖ దేవా ‖
Verse
నాధా! ఈదలేను ఈ ప్రవాహమున్ నీదరిన్ గాన నీ కెరటాలధాటిచే
నావికా రమ్ము నన్ బ్రోవుము‖ దేవా ‖
Verse
స్వామి! నీదు ప్రేమకు నే సాక్షిని సంఘమందున నా పొరుగువారికి నీ
సత్య సువార్త నే జాటుదున్‖ దేవా ‖
Verse
రాజా! నీదు రాజ్యములో జేరితి రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము
రక్షణానందము గూర్చుము‖ దేవా ‖

Related Tags

DevotionalJesusDiscipleship