Verse
దేవా ఈ జీవితం నీకంకితం‖ 2x ‖
ఎన్ని కష్టాలైనా… ఎన్ని నష్టాలైనా…
నీతోనే నా జీవితం
వ్యాధి బాధలైనా… శోక సంద్రమైనా…
నీతోనే నా జీవితం‖ 2x దేవా ‖
Verse
నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి
నీ మార్గమునే నాకు చూపినావు‖ 2x ‖
నీతోనే నడచి – నీలోనే జీవించి
నీతోనే సాగెదను‖ 2x ఎన్ని ‖