Verse
దేవా నా హృదయముతో
నిన్నే నేను కీర్తింతును‖ 2x ‖
మారని ప్రేమ నీదే‖ 2x ‖
నిన్ను కీర్తింతును ఓ.. ఓ..
నిన్ను కొనియాడెద‖ దేవా ‖
Verse
ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా
నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా‖ 2x ‖
నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన
నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన‖ మారని ‖
Verse
నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా
పరలోక రాజ్యములో పరవశించాలని‖ 2x ‖
నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ‖ 2x మారని ‖