Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devaa Naa Mora Aalakinchumaa

దేవా నా మొర ఆలకించుమా

Devaa Naa Mora Aalakinchumaa

Verse
నా ప్రాణం తల్లడిల్లగా
భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను
Chorus
దేవా నా మొర ఆలకించుమా
నా ప్రార్థనకు చెవియొగ్గుమా‖ 2x ‖
నా ప్రాణం తల్లడిల్లగా
భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను‖ 2x ‖
నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి
ఎక్కించుము నను నడిపించుము‖ 2x దేవా ‖
Verse
నీవు నాకు ఆశ్రయముగ నుంటివి
శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి‖ 2x ‖
యుగయుగములు నేను నీ గుడారములో నుందును
నీ రెక్కల చాటున దాగి యుందును‖ 2x దేవా ‖
Verse
నా రక్షణ మహిమకు ఆధారము నీవే
నా ఆశ్రయ దుర్గం నా నిరీక్షణ మార్గము నీవే‖ 2x ‖
నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యా
నీ పోలికగా నన్ను మలచుమయ్యా‖ 2x దేవా ‖

Related Tags

WorshipPrayerSupplication