Verse
దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ కరుణ
సర్వ సదా నిలుచుచున్నది‖ 2x దేవా ‖
Verse
స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే
స్తుతి పాడేను హృదయముతో‖ 2x ‖
స్తుతించి వర్ణించి ఘనపరతున్‖ 2x ‖
నీవే నా రక్షకుడవని‖ దేవా ‖
Verse
మొదట నిన్ను ఎరుగనైతిని
మొదటే నన్ను ఎరిగితివి‖ 2x ‖
వెదుకలేదు ప్రభువా నేను‖ 2x ‖
వెదకితివి ఈ పాపిని‖ దేవా ‖
Verse
అద్భుతమైనది సిలువ దృశ్యం
ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి‖ 2x ‖
ప్రభును వర్ణింప నశక్యము‖ 2x ‖
ప్రభువే సహించె దుఃఖము‖ దేవా ‖
Verse
ఎట్లు మౌనముగా నుందు ప్రభు
చెల్లింపక స్తోత్ర గీతము‖ 2x ‖
కాలమంతా పాడుచుండెద‖ 2x ‖
నీ ప్రేమ అపారమైనది‖ దేవా ‖