Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devaa Paapini

దేవా పాపిని

Devaa Paapini

Chorus
దేవా పాపిని నిన్నాశ్రయించాను
ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా‖ 2x దేవా ‖
Verse
అపరాధినై అంధుడనై
అపవాదితో అనుచరుడై‖ 2x ‖
సంచరించితి చీకటిలో
వంచన చేసితి ఎందరినో –‖ 2x దేవా ‖
Verse
కలువరిలో సిలువొంద
కలవరమొందె జగమంతా‖ 2x ‖
పాపినైన నా కొరకు
మరణమునే భరించితివి
మరణమునే జయించితివి‖ దేవా ‖

Related Tags

PrayerRepentance