Verse
దేవాది దేవా ప్రభువుల ప్రభూ
రాజుల రాజా హల్లెలూయ‖ 2x ‖
Verse
నీ రక్తముతో విమోచించి
నీ రక్తముతో సంపాదించి‖ 2x ‖
పరలోక రాజ్య ప్రజలతో జేర్చి‖ 2x ‖
పరలోక పాటన్ నా కొసగితివి‖ 2x దేవాది దేవా ‖
Verse
జీవిత నావలో తుఫాను రేగ
భయపడకుడని అభయము నిచ్చి‖ 2x ‖
జయప్రదముగా నన్ను నడిపించి‖ 2x ‖
జయజీవితము నా కొసగుచున్న‖ 2x దేవాది దేవా ‖
Verse
పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి
కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి‖ 2x ‖
అరమర లేక నన్నాదరించి‖ 2x ‖
పరలోక దర్శనంబిచ్చితివి‖ 2x దేవాది దేవా ‖
Verse
మరణ పాత్రులం యిద్ధరణిలోన
దురిత ఋణముల స్మరణను మాన్పి‖ 2x ‖
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము‖ 2x ‖
నీ రాజ్యమందు రాజులన్ జేసి‖ 2x దేవాది దేవా ‖
Verse
శోధనగాధల కష్టములలో
నా దుఃఖములలో నే నేడ్వకుండా‖ 2x ‖
నీ దయ నాపై నిండార నింపి‖ 2x ‖
ఓదార్చి నన్ను నీ దారినడుపు‖ 2x దేవాది దేవా ‖
Verse
ప్రతి వత్సరము దయతోడ నింపున్
ప్రభు జాడలు సారము జల్లున్‖ 2x ‖
ప్రతి బీడునూ సారము చిలకన్‖ 2x ‖
ప్రతి పర్వతము ఆనందించున్‖ 2x దేవాది దేవా ‖
Verse
పరలోక పరిశుద్ధ సంఘంబు యెదుట
సర్వశక్తిగల క్రీస్తుని యెదుట‖ 2x ‖
పరలోక నూతన గీతము పాడ‖ 2x ‖
జేర్చితివి నన్ నీ జనమునందు‖ 2x దేవాది దేవా ‖