Verse
దేవాది దేవుడు మహోపకారుడు
మహాత్యము గల మహారాజు‖ 2x ‖
ప్రభువుల ప్రభువు – రాజుల రాజు
ఆయన కృప నిరంతరముండును‖ దేవాది ‖
Verse
సునాద వత్సరము ఉత్సాహ సునాదము
నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము‖ 2x ‖
ఉత్తమ దేవుని దానములు‖ 2x దేవాది ‖
Verse
యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు
జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే‖ 2x ‖
నీదు క్రియలు ఘనమైనవి‖ 2x దేవాది ‖
Verse
అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు
మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును‖ 2x ‖
సదా నీకే కలుగును గాక‖ 2x దేవాది ‖