Chorus
దేవాది దేవాత్మజా మమ్ము దీవించు ప్రభురాజా దేవాదిదైవ మానుషాభవ్య
దేదీప్యగుణతేజా‖ దేవాది ‖
Verse
చెదరిన నీ గొఱ్ఱెల కదుపు వెదుకవచ్చితివియ్యల సదయా
హృదయాభ్యుదయా సాధు జన నిత్య పరిపాలా‖ దేవాది ‖
Verse
దురితాలవాలమునం బుట్టు నరకీటముల మన్నా కరుణారసమనిశము
మాపై విరఁజల్లవే చల్లగా‖ దేవాది ‖
Verse
నరకంబు నిధియొడ్డున మేము దిరుగుచు పడబోయిన తఱి నీ
వెఱిఁగి త్వరగా మమ్ము మరలించి నావన్నా‖ దేవాది ‖
Verse
యేసు నీ దాసులము నీకు దోసిలి యొగ్గినాము దోషా రోషా
భ్యాసములను దూరముఁ దొలఁగించుము‖ దేవాది ‖
Verse
ప్రాణేశ నీ సిలువఁ జిందు శోణితంపు విలువ త్రాణకరము స్ధిరము
దాని దర్శించుటే జీవము‖ దేవాది ‖
Verse
బాలుర మజ్ఞులము మమ్ము బాలింపవే నిత్యము నీ లోపలి జాలి మాకు
నిజముగాఁ జూపించుము‖ దేవాది ‖
Verse
ఆనందమగు నీ కృప మేము ధ్యానించుటకు నేర్పుమా జ్ఞానోజ్వలము
బలము శిశువుల మైన మా కవి యిమ్ము‖ దేవాది ‖