Chorus
దేవదేవుని గొప్ప పురము పరలోకానందముక్రైస్తవ జీవితము యా పురము
దేవ‖ దేవ ‖
Verse
దేవుని పురము దేదీప్య కరము జీవ మందిరము జేగీయ గృహము
దేవ‖ దేవ ‖
Verse
పరిశుద్ధ పురము పరమార్థ కరము పరమ మందిరము పరదైసు
పురము‖ దేవ ‖
Verse
ఆనంద పురము ఆది నిరంతరము కాన దుస్తరము ఘన మనోహరము
దేవ‖ దేవ ‖
Verse
శృంగార పురము సుర చిర కరము బంగారు మెరము ప్రభల
భాసురము‖ దేవ ‖
Verse
వైభవ పురము వంద్య మప్పురము సౌభాగ్య కరము స్ఫటిక మందిరము
దేవ‖ దేవ ‖
Verse
కెంపు పాండురము కీర్తి బంధురము ఇంపౌ నగరము ఇదియే
సుస్థిరము‖ దేవ ‖
Verse
క్షుదలేని పురము సుక్షేమ కరము ముదము విస్తరము రొదలు
దుస్తరము‖ దేవ ‖
Verse
ఆశ్చర్య పురము ఆశ్రయ కరము నిశ్చయపరము నిజదేవ పురము
దేవ‖ దేవ ‖
Verse
మాణిక్య పురము మణుల గోపురము వీణెలు స్వరము విన మనోహరము
దేవ‖ దేవ ‖
Verse
సూర్యభాసురము చొరనట్టి పురము కార్య మబ్బురముఁ గావించు
గరము‖ దేవ ‖
Verse
సీయోను పురము శ్రేయస్సాగరము మాయ విధురము మరి
సంపత్కరము‖ దేవ ‖
Verse
ఇచ్చు నిబ్బరము యెరుషలేం పురము మెచ్చౌ నబ్బురము మెరయు
మా పురము‖ దేవ ‖