Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devadevuni Koniyaadedamu Aviratha Triyekuni Sthothrinthumu

దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము

Devadevuni Koniyaadedamu Aviratha Triyekuni Sthothrinthumu

Verse
దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. కీర్తన Psalm 136:2
Chorus
దేవదేవుని కొనియాడెదము - అవిరత త్రియేకుని స్తోత్రింతుము
Pre-Chorus
ఏపుగా దయాళుని పొగడెదము
పాప పరిహారుని పాడెదము
Verse
దూతలు స్తుతించు మహోన్నతుడు
కన్యమరియ యందు జన్మించెను
మహియందు చీకటి పోగొట్టి
ఇహపర సుఖముల దయచేసెను
Verse
పాపశాపమును తీర్చను
పాట్లుపడెను దేవ గొర్రెపిల్ల
హా! మంచి గొఱ్ఱెల బోయడే
ప్రాణము నిచ్చెను మనకై
Verse
పాపముల కడిగి రక్షించెను
కృపనిచ్చె వేచియుండుటకై
వైరిని జయింపను శక్తినిచ్చె
నరులకు భాగ్యము నందించెను
Verse
ఆకాశము నుండి దిగి వచ్చును
లోకమున్ న్యాయము తీర్చుటకై
ఆయత్తముగ కాచియుండెదరు
పాయక వివేక కన్యల వలె
Verse
తన స్వరూపము నే దాల్చను
ఆయనే నా రూపము దాల్చెన్
దాసుడనగు నన్ను రక్షింపన్
యేసు నరరూపము దాల్చెన్
Verse
పాతాళ లోకము కూల్చవచ్చెన్
జాతి యడ్డుగోడ పడగొట్టెను
నిత్య జీవంబు నియ్యను వచ్చెను
నీతి సూర్యుడు ప్రభు యేసువే
Verse
హల్లెలూయ పాడి ఆర్భటింతుము
హర్షముతో యేసున్ చాటెదము
బలుడైన తండ్రిని కీర్తింతుము
విలువ శుద్ధాత్మను శ్లాఘింతుము

Related Tags

PraiseWorshipTrinity