Verse
దేవపుత్రులందఱు
ఎంతో భాగ్యవంతులు
పాప మరణాదులు
పరిహారమాయెను.
నేను నట్టివారితో‖ నేను నట్టివారితో ‖
Verse
వారు క్రీస్తువల్లనే
ఐరి నీతిమంతులు
స్ధిరమైన నెమ్మది
భక్తులందరొందరి.
Verse
తండ్రి యొద్ద పిల్లలు
నిర్భయాళులౌదురు
వారు కూడ దేవునిన్
చేర భయపడరు.
Verse
వారి కెట్టి కష్టముల్
హానిచేయ నేరవు
వారికిన్ నిజంబుగా
శ్రమ యుపయోగము
Verse
ఇహమందు కరుణ
చావువేళ నెమ్మదిది
పరమందు భాగ్యము
వారికిన్ సంపూర్ణము.